: జూకర్ బర్గ్ ను చంపేసిన ఫేస్ బుక్ .. మెమోరియల్ ప్రొఫైల్స్ లో జూకర్ పేరు!
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ ను ఆయన సొంత సంస్థ చంపేసింది. చనిపోయిన వారి స్మారక ప్రొఫైల్స్ ను ఇతర అకౌంట్లలోకి పోస్ట్ చేసింది ఫేస్ బుక్. దాదాపు 20 లక్షల మెమోరియల్ ప్రొఫైల్స్ ను పోస్ట్ చేసింది. వీటిలో సంస్థ అధినేత జూకర్ బర్గ్ పేరు కూడా ఉంది. అంతేకాదు, ఎంతో మంది బతికున్న వారిని చనిపోయినట్టు చూపించింది. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకున్న ఫేస్ బుక్ సిబ్బంది నాలుక్కరుచుకున్నారు. తమ యూజర్లకు క్షమాపణ చెప్పారు. పెద్ద తప్పు జరిగిందని... దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నామని ఫేస్ బుక్ తెలిపింది. జరిగిన దానికి సంబంధించి ఫేస్ బుక్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.