: దొంగ నోట్లను బ్యాంక్ లో జమ చేయాలనుకుని దొరికిపోయాడు


పాత నోట్లను జమ చేయడానికి వస్తున్న వారు, విత్ డ్రా చేసుకోవడానికి వస్తున్న వారితో బ్యాంకులు కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదనుగా దొంగ నోట్లను బ్యాంకులో జమ చేయడానికి వచ్చాడో ప్రబుద్ధుడు. ఒడిశాలోని ఖుద్రా పట్టణంలో ఈ ఘటన జరిగింది. సుమిత్ కుమార్ అనే యువకుడు నకిలీ నోట్లను జమ చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు. మొత్తం 2.5 లక్షల రూపాయలను జమ చేయడానికి ఎస్బీఐకు వచ్చాడు సుమిత్. ఇందులో రూ. 1000 నోట్లు 42, రూ. 500 నోట్లు 10 నకిలీవి ఉన్నాయి. వీటిని గుర్తించిన బ్యాంకు అధికారులు వెంటనే పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. పోలీసులు వచ్చి సుమిత్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాను ఓ బ్యాంకు అధికారి కుమారుడినని... తన తండ్రి డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వచ్చానని పోలీసులకు సుమిత్ తెలిపాడు.

  • Loading...

More Telugu News