: కొత్త 2000 నోటులో అదనపు సెక్యూరిటీ ఫీచర్స్ లేవు... దొంగనోట్లు కూడా గుద్దేయొచ్చట!


కొత్తగా విడుదలైన 2000 నోట్లకు సంబంధించి షాకింగ్ న్యూస్ తెలిసింది. నకిలీ కరెన్సీకి చెక్ పెట్టే విధంగా కొత్త నోటు ఉందంటూ అందరూ చెబుతున్న తరుణంలో అసలు విషయం బయటకొచ్చింది. ఇందులో అదనంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఏమీ లేవని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాత రూ. 500, రూ. 1000 నోట్లలో ఏ ఫీచర్స్ ఉన్నాయో... ఇందులో కూడా అవే ఉన్నాయని చెప్పారు. హై సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టాలంటే చాలా కసరత్తు చేయాల్సి ఉంటుందని... కనీసం ఐదు నుంచి ఆరు సంవత్సరాల సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి ఎక్సర్ సైజ్ 2005లో చేపట్టారని... సెక్యూరిటీ థ్రెడ్, ఫైబర్, గుప్త చిత్రం, వాటర్ మార్క్ లాంటి భద్రతా ఏర్పాట్లు చేయాలంటే అనేక అనుమతులు అవసరమని, కేబినెట్ ఆమోదం కూడా అవసరమని చెప్పారు. కొత్త నోట్లను ముద్రించాలనే నిర్ణయం ఆరు నెలల క్రితమే తీసుకున్నారని... అయితే సమయం చాలకపోవడంతో డిజైన్ మార్చినప్పటికీ, సెక్యూరిటీ ఫీచర్చ్ ను మాత్రం పాత నోట్ల మాదిరిగానే ఉంచినట్టు సదరు అధికారి చెప్పారు. నకిలీ నోట్లను అరికట్టడం కూడా అసాధ్యమని స్పష్టం చేశారు. పాకిస్థాన్ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లోనే నకిలీ నోట్లు ముద్రితమవుతున్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News