: ఏపీలో ఇంకా పనిచేయని ఏటీఎంలు.. నిరాశతో వెనుదిరుగుతున్న ఖాతాదారులు
ఏపీలో పలుచోట్ల ఏటీఎంలు ఇంకా పనిచేయకపోవడంతో ఖాతాదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. రాష్ట్రంలోని పలుచోట్ల ఏటీఎంలలో డబ్బు నింపకపోవడంతో ఖాతాదారులకు అవస్థలు తప్పట్లేదు. ఔట్ సోర్సింగ్ నిర్వహణలోని ఏటీఎంలు పూర్తిగా తెరచుకోకపోవడంతో ఖాతాదారులు అసహనానికి గురవుతున్నారు. కాగా, వీకెండ్ కావడంతో పెద్దనోట్లను మార్చుకునేందుకు ఆయా బ్యాంకుల వద్దకు భారీ సంఖ్యలో ఖాతాదారులు చేరుకున్నారు. ప్రతి బ్యాంకు వద్ద పెద్ద పెద్ద క్యూలు కనపడుతుండటం గమనార్హం.