: తిరుమల రహదారిలో ప్రమాదం..ఫెన్సింగ్ ను ఢీకొట్టిన కారు
తిరుమల రహదారిలో ఈరోజు ఉదయం ప్రమాదం జరిగింది. చెన్నైకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న ఓ కారు మొదటి కనుమ దారిలోని 13వ మలుపు వద్ద అదుపుతప్పి ఫెన్సింగ్ ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో నలుగురు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.