: కారులో వెళ్తూ వెయ్యి నోట్లు విసిరేశాడు... ఏరుకోవడానికి ఎగబడ్డ జనాలు
పెద్ద నోట్లు రద్దవడంతో జనాలు రకరకాల చిత్ర, విచిత్రాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి కారులో వెళ్తూ వెయ్యి రూపాయల నోట్లను విసిరేశాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో జరిగింది. స్థానికంగా ఉన్న ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఒక మెకానిక్ షెడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న కారులోంచి లక్షకు పైగా విలువున్న వెయ్యి నోట్లను గుర్తు తెలియని వ్యక్తి విసిరేసి, ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో, అటువైపు వస్తున్న జనాలు ఆ నోట్లను ఏరుకోవడానికి ఎగబడ్డారు. వాటిని దక్కించుకున్న వారికి, అవి ఒరిజినలా? లేదా దొంగనోట్లా? అర్థం కాలేదు. దీంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ కు వెళ్లారు. అక్కడ ఆ నోట్లు చెల్లడంతో ఒరిజినలే అని నిర్ధారించుకున్నారు.