: పెద్ద నోట్లు రద్దు కావడం వల్లే జగన్ కు అస్వస్థత: వర్ల రామయ్య


పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం పట్ల దేశ ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే... వైసీపీ అధినేత జగన్ మాత్రం అస్వస్థతకు గురయ్యారని టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన డబ్బును ఎలా వైట్ చేసుకోవాలా? అని జగన్ దిగులు పడుతున్నారని... అందువల్లే ఆయనకు అస్వస్థత కలిగి ఉంటుందని అన్నారు. తన విలాసవంతమైన భవనాల నేల మాళిగల్లో అక్రమ సంపాదనను జగన్ దాచిపెట్టినట్టు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు. జగన్ పై సీబీఐ నమోదు చేసిన అక్రమ కేసుల విలువ రూ. 43 వేల కోట్లని... దీనికి అదనంగా మరో రూ. 43 వేల కోట్ల అవినీతి సొమ్ము జగన్ వద్ద ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా తన అవినీతి సొమ్మును జగన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News