: నోట్ల రద్దు తర్వాత గవర్నర్ తో కేసీఆర్ చర్చలేంటి? ప్రజలకు అనేక అనుమానాలొస్తున్నాయి: కాంగ్రెస్
రూ. 500, రూ. 1000 నోట్లు రద్దయిన తర్వాత గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు గంటలకు పైగా చర్చలు జరపడంపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయని టీకాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గవర్నర్ తో కేసీఆర్ ఏం చర్చించారో ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లధనంపై వీరు చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోందని... కేసీఆర్ రహస్య అజెండా ఏంటో బయటపెట్టాలని అన్నారు. రాష్ట్ర మంత్రులతో గవర్నర్ కు కాళ్లు మొక్కించడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని... దీనిపై బహిరంగ చర్చకు మంత్రి హరీష్ రావు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం కింద ఎన్ని చెరువుల్లో పనులు జరిగాయి, ఎంత పని జరిగింది? అనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.