: పెద్దనోట్లు మార్చుకునే పనిలో మావోయిస్టులు
రద్దయిన పెద్దనోట్లు మార్చుకునే పనిలో మావోయిస్టులు కూడా ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ సమాచారం మేరకు మావోయిస్టు నేతకు చెందిన రూ.25 లక్షలను జార్ఖండ్ పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. డంపుల్లో ఆయుధాలతో పాటు డబ్బులను మావోలు దాస్తుంటారని, రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి గిరిజనులను ఉపయోగించుకుంటున్నారని నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మావోలకు సంబంధించిన పెద్దనోట్ల మార్పిడి జరగవచ్చనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో గిరిజనులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలపై సంబంధిత అధికారులు ఒక కన్నేసినట్లు తెలుస్తోంది.