: పెట్రోల్ బంకులు, రైల్వే కౌంటర్లు, విమానాశ్రయ కౌంటర్లలో పాత నోట్లే చెల్లుతాయి
500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన కేంద్రం ప్రజల ఇక్కట్లను తగ్గించడంలో భాగంగా మరో నిర్ణయం తీసుకుంది. నేటి మధ్యాహ్నం వాహనదారుల ఇబ్బందులను తొలగిస్తూ, టోల్ గేట్ల వద్ద ట్యాక్స్ రద్దు నిర్ణయం ఈ నెల 14 వరకు వర్తిస్తుందని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం ఇదే తరహాలో 500, 1000 రూపాయల నోట్లు ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, రైల్వే కౌంటర్లు, విమానాశ్రయాల్లో మరో మూడు రోజుల పాటు చెల్లుతాయని, అక్కడ పాత నోట్లను స్వీకరిస్తారని కేంద్రం ప్రకటించింది. ఈ నెల 14 వరకు ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.