: ఆ ప్రచారంలో వాస్తవం లేదు: బండారు దత్తాత్రేయ


500, 1000 రూపాయల నోట్ల రద్దు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నెలకు 2,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, గవర్నర్‌ కు ఫిర్యాదు చేశారన్న విషయాన్ని తెలుసుకునేందుకు తాను గవర్నర్‌ ను కలిశానని చెప్పారు. అసలు పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి నష్టం వస్తుందన్న విషయంపై చర్చే జరగలేదని ఆయన చెప్పారని దత్తాత్రేయ వెల్లడించారు. గవర్నర్‌ వద్ద బడ్జెట్‌ రీ-ఆర్గనైజేషన్‌ పై మాత్రమే చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. కేవలం 3 రోజుల లావాదేవీలు పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందన్న అభిప్రాయానికి రావడం సరికాదని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News