: టీఎస్ పీఎస్సీ గ్రూప్-2లో ‘కబాలి’, ‘ధోనీ’ సినిమాలపై ప్రశ్నలు


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈరోజు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో ‘కబాలి’, ‘ధోనీ’ చిత్రాలపై ప్రశ్నలు వచ్చాయి. ‘మై ఫాదర్ బాలయ్య’ అనే పుస్తకాన్ని హీరో రజనీకాంత్ చదువుతూ కనిపించే సన్నివేశంతో 'కబాలి' సినిమా ప్రారంభమవుతుంది. అయితే, ‘మై ఫాదర్ బాలయ్య’ అనే పుస్తకానికి, తెలంగాణతో ఉన్న సంబంధం ఏమిటంటూ గ్రూప్-2 పరీక్షలో ఒక ప్రశ్న సంధించారు. కాగా, టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్ర దర్శకుడు ఎవరంటూ మరో ప్రశ్నను ఈ పరీక్షలో అడిగారు.

  • Loading...

More Telugu News