: బోనీని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానంటున్న శ్రీదేవి


అందాల నటి శ్రీదేవి తన భర్త బోనీకపూర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తన ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతా ద్వారా శ్రీదేవి తన కుటుంబంతో ఉన్న ఒక ఫొటోను పోస్ట్ చేసింది. ‘నా బలం, బెస్ట్ ఫ్రెండ్ అయిన మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అని శ్రీదేవి పోస్ట్ చేసింది. తన కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫొటోలనే కాకుండా బోనీకపూర్ తో కలిసి ఉన్న నాటి ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. కాగా, బాలీవుడ్ నిర్మాత అయిన బోనీకపూర్ ను 1996లో శ్రీదేవి వివాహం చేసుకుంది. జాహ్నవి, ఖుషి కపూర్ వీరి సంతానం. జాహ్నవి త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News