: గెలవగానే ట్రంప్ కు సవాల్ విసిరిన భారత సంతతి సెనెటర్
సెనెటర్ గా విజయం సాధించిన భారత సంతతి మహిళ కమల హారిస్ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సవాల్ విసిరారు. ట్రంప్ యాంటీ ఇమ్మిగ్రేషన్ విధానాలపై బహిరంగంగానే పోరాడతానని ప్రకంటించారు. ఈ మేరకు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా ఆమె సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె తన మద్దతుదారులకు రాసిన ఈమెయిల్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో రాజకీయాల్లో జాత్యహంకారం, పక్షపాత ధోరణిని పూర్తిగా వ్యతిరేకిస్తానని తెలిపారు. దేశం నుంచి పెద్ద మొత్తంలో బహిష్కరణలు, అమెరికా-మెక్సికో మధ్య గోడ కడతానన్న ట్రంప్ వ్యాఖ్యలు నిజం కాబోవని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, కాలిఫోర్నియాకు రెండుసార్లు అటార్నీ జనరల్ గా పనిచేసిన ఆమె, జనవరి 3న సెనేటర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.