: పవన్ చెప్పిన అంశాలను సూచనగా స్వీకరిస్తాం.. టీడీపీ సభ్యత్వ నమోదులో అగ్రస్థానంలో గుంటూరు: చినరాజప్ప


జనసేన పార్టీ అధినేత పవన కల్యాణ్ చెప్పిన అంశాలను సూచనగా స్వీకరిస్తామని ఏపీ మంత్రి చినరాజప్ప అన్నారు. రాష్ట్రాభివృద్ధిని సవాలుగా తీసుకుని సీఎం పని చేస్తున్నారని, మంచి పాలన అందించాలన్నదే ప్రభుత్వ ఏకైక ధ్యేయమని అన్నారు. పదిరోజుల్లో 9 లక్షల మందికి పైగా టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకున్నారని, టీడీపీ సభ్యత్వ నమోదులో గుంటూరు జిల్లా అగ్రస్థానంలో ఉందని, చిత్తూరు జిల్లా రెండో స్థానంలోను, కృష్ణా జిల్లా మూడో స్థానంలోను ఉండగా ఉభయగోదావరి జిల్లాలు వరుసగా 4,5 స్థానాల్లో నిలిచాయన్నారు.

  • Loading...

More Telugu News