: కస్టమర్లకు సేవలందిస్తున్న బ్యాంకింగ్ రోబో ‘లక్ష్మి’


బ్యాంకింగ్ రోబో ‘లక్ష్మి’ తన సేవలను కస్టమర్లకు అందించడం మొదలు పెట్టింది. దేశంలోనే మొట్టమొదటి బ్యాంకింగ్ రోబో అయిన ‘లక్ష్మి’ సేవలు చెన్నైలోని సిటీ యూనియన్ బ్యాంక్ టీ.నగర్ శాఖలో నిన్న ప్రారంభమయ్యాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ‘లక్ష్మి’ సాధారణ ఇంగ్లీషు భాషలో చక్కగా స్పందిస్తుంది. తమ ఖాతాదారులకు బ్యాంక్ వ్యవహారాలను వివరిస్తుంది. ఖాతాదారుల అకౌంట్ వివరాలను చెప్పడంతో పాటు, హోమ్ లోన్, పర్సనల్ లోన్ గురించి చక్కగా వివరించి చెబుతుంది. ఖాతాదారుల అనుమానాలకు చక్కగా స్పందిస్తుంది. ఒకవేళ, ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే కనుక, ఆ సమాచారాన్ని బ్యాంక్ మేనేజర్ కు చేరవేస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ రోబో గురించి బ్యాంక్ ప్రతినిధులు మాట్లాడుతూ, ‘లక్ష్మి’ ప్రస్తుతం ఇంగ్లీషులో మాట్లాడుతోందని, త్వరలోనే తమిళ భాషలో కూడా మాట్లాడుతుందని చెప్పారు. ఖాతాదారులకు అవసరమైన 125 రకాల సేవలను అందించే ‘లక్ష్మి’, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుందని, ఈ తరహా సేవలను మరో పాతిక బ్యాంకుల్లో ప్రారంభిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News