: ట్విట్టర్ లో మోదీని వదిలేసిన 3.5 లక్షల మంది ఫాలోవర్లు!


500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని 3.5 లక్షల మంది ఆయనను వదిలి వెళ్లిపోయారు. ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతాను భారీ సంఖ్యలో అభిమానులు అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా పెద్ద నోట్ల కరెన్సీని రద్దు చేయడం, రద్దు చేసిన కరెన్సీ స్థానంలో అంతకంటే ఎక్కువ విలువైన నోట్లు విడుదల చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఖాతాను వీడుతున్నట్టు 3.5 లక్షల మంది ప్రకటించారు. అయితే కరెన్సీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? అన్న దానిపై ఆయన వివరణ ఇచ్చిన అనంతరం మళ్లీ ఖాతాను అనుసరిస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News