: పాతనోట్లు తీసుకోవాలని ఆర్టీసీ కండక్టర్లను ఆదేశించాం: ఏపీ డీజీపీ, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు
ఆర్టీసీ బస్సుల్లో పాతనోట్లు రూ.500, రూ.1000 నోట్లను ప్రయాణికుల నుంచి తీసుకోవాలని కండక్టర్లను ఆదేశించామని ఏపీ డీజీపీ, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సుల్లో ఆయా నోట్లను కండక్టర్లు స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. పాతనోట్లు మార్చుకునేందుకు, ఏటీఎంలలో డబ్బు డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు వస్తున్న నేపథ్యంలో ఆయా చోట్ల భద్రత పెంచామని సాంబశివరావు పేర్కొన్నారు.