: ప్లేట్లలో పెద్ద నోట్లను పెట్టి వీధుల్లో అమ్మేస్తున్నారు: రితేష్ దేశ్ ముఖ్


500, 1000 రద్దు చేశామన్న కేంద్రం నిర్ణయంతో చిత్రవిచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బిచ్చగాడికి వెయ్యి రూపాయల నోటు దానం చేస్తే దానిని స్వీకరించేందుకు అతను నిరాకరించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలో ఓ వ్యక్తి ప్లేటులో 500 రూపాయల నోట్లను పెట్టి, గట్టిగా అరుస్తూ వీధుల్లో అమ్ముతున్నాడు. ఈ వీడియోను ప్రముఖ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ పోస్టు చేశాడు. ఇది వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తుండగా, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ...'మంచిది సార్, అద్భుతాలు జరుగుతున్నాయి' అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News