: పుజారా అవుట్... కోహ్లీ ఇన్!
రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పుజారా అవుటయ్యాడు. మూడో రోజు ఆదిలోని గౌతమ్ గంభీర్ (29) వికెట్ ను చేజిక్కించుకున్న ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా ఆటగాళ్లు విజయ్, పుజారా చుక్కలు చూపించారు. హోం గ్రౌండ్ లో పుజారా దూకుడుగా ఆడుతూ, ఓపెనర్ మురళీ విజయ్ కంటే వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవుట్ చేసే అవకాశం ఇవ్వని చటేశ్వర్ పుజారాను స్టోక్స్ చక్కటి బంతితో అవుట్ చేశాడు. బెన్ స్టోక్స్ వేసిన 92వ ఓవర్ తొలి బంతిని పుజారా కట్ చేసేందుకు ప్రయత్నించి, కుక్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 206 బంతులు ఎదుర్కొన్న పుజారా 124 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో విజయ్ (112) కి కోహ్లీ (6) జతకలిశాడు. దీంతో టీమిండియా 96 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.