: పెద్దనోట్ల రద్దు ప్రభావం.. స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు!
ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇంకా చెప్పాలంటే, ఈ ఏడాదిలో రెండో అతిపెద్ద నష్టాలతో ముగిసిన రోజుగా చెప్పాలి. సెన్సెక్స్ 699 పాయింట్ల నష్టంతో 26,818 పాయింట్ల వద్ద, నిఫ్టీ 229 పాయింట్లు కోల్పోయి 8,296 పాయింట్ల వద్ద ముగిశాయి. కాగా, పెద్దనోట్ల రద్దు ప్రభావం స్టాక్ మార్కెట్లపై, ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియాల్టీ రంగాలపై పడిందని ఆర్థిక రంగ నిపుణుల అంచనా.