: భవనాల నేల మాళిగల్లోనే జగన్ తన నల్లడబ్బు దాచుకున్నారు: టీడీపీ నేత వర్ల రామయ్య
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా సానుకూల స్పందన వస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత నేత జగన్ మాత్రం ఎందుకు స్పందించడం లేదని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. జగన్ ప్రస్తుతం ఈ అంశంలో దిగులు చెందుతున్నారని, నల్లధనాన్ని ఎలా మార్చుకోవాలా? అని ఆలోచిస్తూ అస్వస్థతకు గురై ఉంటారని వ్యాఖ్యానించారు. జగన్ నిర్మించుకున్న భవనాల నేల మాళిగల్లోనే తన నల్లడబ్బు దాచిపెట్టుకున్నట్లు తమకు తెలుస్తోందని పేర్కొన్నారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్‌పై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో అక్రమాస్తుల విలువ రూ.43 వేల కోట్లని చెప్పిన వర్ల రామయ్య... జగన్ వద్ద మరో రూ.43 వేల కోట్ల నల్లధనం ఉందని ఆరోపించారు.