: భేష్ విజయ్, పుజారా... సెంచరీలతో కదంతొక్కిన ఆటగాళ్లు!


రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్‌ జట్టుకు దీటుగా సమాధానమిస్తున్నారు. 63 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన భారత ఓపెనర్లు మరో నాలుగు పరుగులు జోడించి తొలి వికెట్ కోల్పోయారు. గంభీర్ కేవలం 29 పరుగులకే అవుటైన నిరాశపరిచాడు. అనంతరం మురళీ విజయ్ కు జతకలిసిన ఛటేశ్వర్ పూజారా భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ప్రత్యర్థులకు వీరిద్దరూ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నిలకడగా ఆడారు. విజయ్ సెంచరీ చేసేందుకు 255 బంతులు తీసుకోగా, పుజారా సెంచరీ చేసేందుకు 169 బంతులు తీసుకున్నాడు. దీంతో టీమిండియా టాపార్డ్ ఇంగ్లండ్ జట్టుకు దీటైన సమాధానం ఇస్తోంది. ప్రస్తుతం మురళీ విజయ్ (103), ఛటేశ్వర్ పూజారా (112) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కంటే టీమిండియా 279 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా చేతిలో ఇంకా 9 వికెట్లున్నాయి. ప్రస్తుతం టీమిండియా 86 ఓవర్లలో 258 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News