: అప్పటి నుంచి రసగుల్లా విక్రయాలు పెరిగాయి: బీహార్ సీఎం నితీష్ కుమార్


బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించినప్పటి నుంచి రసగుల్లా విక్రయాలు పెరిగాయని సీఎం నితీష్ కుమార్ పేర్కొన్నారు. తూర్పు చంపారన్ జిల్లాలో ఈరోజు జరిగిన నిశ్చయ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడిన నితీష్, మద్యపాన నిషేధం కారణంగా రసగుల్లా విక్రయాలు 16.25 శాతం పెరిగాయని పేర్కొన్నారు. కేవలం రసగుల్లానే కాకుండా దూద్పేడ, పన్నీర్, దహి, పాలు, ఇతర పాలపదార్థాల విక్రయాలు కూడా 11 శాతం పెరిగాయన్నారు. మరో విషయమేమిటంటే, రాష్ట్రంలో జరుగుతున్న నేరాల సంఖ్య కూడా తగ్గిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అక్టోబర్ 31 వరకు నేరాలు 36 శాతం తగ్గాయన్నారు. అపహరణలు, హత్య కేసులు కూడా చాలా వరకు తగ్గాయని నితీష్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News