: ప్రత్యేకహోదా విషయంలో పవన్ నిజానిజాలు తెలుసుకోవాలి: కాల్వ శ్రీనివాసులు
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నిజానిజాలు తెలుసుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడాలని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని కోరింది, పోరాడింది టీడీపీయేనని అన్నారు. సాంకేతికంగా ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం చెప్పినందువల్లే, ప్రత్యేక ప్యాకేజ్ కు అంగీకరించామన్నారు. ఏపీలో చంద్రబాబు పాలన బాధ్యతాయుతంగా, పారదర్శకంగా సాగుతోందని ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.