: జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
వైద్య విద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఈ రోజు హైకోర్టు ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినడం జరిగింది. ఈ కేసులో నిందితురాలైన గుంటూరు జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు అడిగింది. దీంతో లక్ష్మి పరారీలో ఉందని న్యాయవాది పేర్కొన్నారు. అనంతరం వైద్య విద్యార్థిని ఆత్మహత్యకేసులో తమకు నివేదిక సమర్పించాలని సూచించింది. ఇందుకోసం తమకు మూడు వారాలు గడువు ఇవ్వాలని న్యాయవాది కోరారు. ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.