: పూర్తిస్థాయి ఏటీఎం కార్య‌క‌లాపాల‌కు మ‌రో 10 రోజులు ఆగాల్సిందే: ఎస్‌బీఐ ఛైర్మ‌న్


దేశ వ్యాప్తంగా చిల్ల‌ర డ‌బ్బులు, కొత్త నోట్ల కోసం ప్ర‌జ‌లు ప‌డుతున్న అవ‌స్థ‌లు కొన‌సాగుతున్నాయి. ఎంతో మంది ప్ర‌జ‌లు బ్యాంకుల ముందు, ఏటీఎం కేంద్రాల ముందు బారులు తీరి క‌న‌ప‌డుతున్నారు. ప‌లు చోట్ల‌ బ్యాంకుల సిబ్బందితో ప్ర‌జ‌లు గొడ‌వ‌కు దిగుతున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు బ్యాంకుల అధికారులు త‌మ ప‌రిస్థితిపై ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. పూర్తి స్థాయి ఏటీఎం కార్య‌క‌లాపాల‌కు మ‌రో 10 రోజులు ఆగాల్సిందేన‌ని ఎస్‌బీఐ ఛైర్మ‌న్ కొద్ది సేప‌టి క్రితం మీడియాకు తెలిపారు. ఇతర బ్యాంకులకు చెందిన కొందరు అధికారులు మాట్లాడుతూ.. రెండు రోజుల్లో కొత్త నోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌స్తాయని, ఆ తర్వాత ఏటీఎం సేవ‌లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొన్నారు. పలు చోట్ల సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News