: డిసెంబరు 31 వరకు పాత నోట్లను మార్చుకునే వీలుంది.. అపోహలు వద్దు: అమిత్ షా
దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నవారికి పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం అడ్డుకట్ట వేస్తుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జాతి ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. డిసెంబరు 31 వరకు ఈ నోట్లను మార్చుకునే వీలు ఉంది కాబట్టి, ప్రజలు ఎటువంటి ఆందోళన పడే అవసరం లేదని చెప్పారు. పాత నోట్ల రద్దుతో సామాన్యులకు నష్టం లేదని స్పష్టం చేశారు. రెండున్నర లక్షల రూపాయల వరకు జమ చేసుకునే వారికి ఎలాంటి నిబంధనలు లేవని చెప్పారు. దేశ ప్రజలందరూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలని కోరుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థలో మంచి మార్పు కోసం సహకరించాలని, పాత నోట్ల రద్దుపై అపోహలు, ఆందోళనలు వద్దని సూచించారు.