: పక్క రాష్ట్రాల్లో ప్రొఫెసర్ లక్ష్మి దంపతులు... డబ్బుల్లేక వెనక్కు వస్తున్న పోలీసులు!
గైనకాలజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ లక్ష్మి, ఆమె భర్త విజయసారథి రాష్ట్రంలో లేరని, పక్క రాష్ట్రాలకు పారిపోయారని గుర్తించిన పోలీసులు, ప్రత్యేక బృందాలను పంపినప్పటికీ వారు వెనక్కు తిరిగి వస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లిన పోలీసులు, వారి వద్ద డబ్బుల్లేకపోవడం, పాత నోట్లు రద్దు కావడంతో పలు ఇబ్బందులు పడి, ఎలాగోలా తిరుగు ప్రయాణం ఖర్చులకు డబ్బు చూసుకుని వెనక్కు తిరిగి వస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇక లక్ష్మి దంపతులు మాత్రం బెయిల్ వచ్చిన తరువాతనే గుంటూరుకు రావాలని భావిస్తున్నట్టు పోలీసులకు ఉప్పందింది. వీరు సెల్ ఫోన్లు ఆపివేయడం, బ్యాంకు కార్డులను ఎక్కడా వినియోగించక పోవడంతో ఇద్దరూ ఎక్కడ తలదాచుకున్నారన్న విషయం తెలియడం లేదని, ఎలాగైనా వీరిని ట్రేస్ చేసి అరెస్ట్ చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.