: రెడ్ లైట్ ఏరియానూ తాకిన 'పెద్ద నోట్ల రద్దు' ఇబ్బంది!
పెద్ద నోట్ల రద్దు కష్టాలు కడుపు నింపుకునేందుకు వేశ్యా వృత్తిని చేపట్టిన వారినీ తాకాయి. తమ వద్దకు వచ్చే కస్టమర్లందరూ రద్దు కాబడిన నోట్లను మాత్రమే ఇస్తుండటం, వాటిని మార్చుకునేందుకు తమ వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులూ లేకపోవడంతో సెక్స్ వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇండియాలోని అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా అయిన కోల్ కతాలోని సోనాగాచిలో, పాత నోట్లు తీసుకోకుంటే తమకు అసలు పూటగడిచే మార్గం పూర్తిగా మూసుకుపోతుందని మహిళలు వాపోతున్నారు. ఇక తరచుగా వచ్చే వాళ్లయితే, తదుపరి వచ్చినప్పుడు కొత్త నోట్లు తెచ్చివ్వాలని కోరుతూ, పెద్ద మొత్తాల్లో చెల్లించాల్సిన కస్టమర్ల వివరాలు రాసుకుని, ఆ తరువాత వారి నుంచి కొత్త నోట్లు తీసుకుంటామని చెబుతున్నారు. పాత నోట్లు తీసుకోలేక, తీసుకున్నా కొత్త నోట్లు పొందలేక ఇబ్బందులు పడుతూ, అప్పుపై ఆనందాన్ని పంచుతున్న వీరి సమస్యకు పరిష్కారాన్ని ప్రభుత్వాలు చూపలేవేమో!