: ట్రంప్ తో భేటీ తర్వాత ఒబామాలో పెరిగిన విశ్వాసం


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని ఇంతకు ముందు చెప్పిన ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా వైఖరిలో మార్పు వచ్చింది. ట్రంప్ తో 90 నిమిషాల పాటు భేటీ అయిన తర్వాత ఒబామాలో మార్పు వచ్చిందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ అన్నారు. ఈ భేటీ తర్వాత ఒబామాలో విశ్వాసం పెరిగిందని... ఆయనలో కొత్త విశ్వాసం కనిపిస్తోందని చెప్పారు. ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగిందని... ట్రంప్ తన ఆలోచనలను పంచుకున్న తర్వాత, ఇక ఎలాంటి టెన్షన్ లేకుండా అధ్యక్ష బాధ్యతలను ట్రంప్ కు అప్పజెప్పవచ్చనే అభిప్రాయానికి ఒబామా వచ్చారని జోష్ తెలిపారు. సమావేశం సందర్భంగా, పొరుగు దేశాలతో వ్యవహరించాల్సిన తీరుతెన్నులు, విదేశీ ఒప్పందాలు, విభేదాలు తదితర అంశాలను ట్రంప్ కు ఒబామా వివరించారట. త్వరలో జర్మనీ, గ్రీస్, పెరూలో జరగనున్న అపెక్ సమావేశాల్లో అనుసరించాల్సిన విదేశాంగ విధానాల గురించి చర్చించారట. అంతేకాదు, వైట్ హౌస్ లో జరిగే కార్యకలాపాల గురించి కూడా ట్రంప్ కు క్షుణ్ణంగా వివరించారట.

  • Loading...

More Telugu News