: హాజల్ కీచ్ తో ప్రీవెడ్డింగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న యువీ
బ్రిటీష్ మోడల్ హాజెల్ కీచ్ ను టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం నవంబర్ 30న చండీగఢ్ లో సిక్కు సంప్రదాయంలో, డిసెంబర్ 2న హిందూ సంప్రదాయంలో గోవాలో జరుగనుంది. అనంతరం ఢిల్లీలో ఘనంగా విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు. పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో, తన కాబోయే భార్య హాజల్ కీచ్ తో ప్రీవెడ్డింగ్ లైఫ్ ను యువీ ఎంజాయ్ చేస్తున్నాడు. బుధవారం రాత్రి ఢిల్లీలో తన స్నేహితులకు స్పెషల్ డిన్నర్ ఇచ్చాడు యువీ. ఈ డిన్నర్ కు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సోదరి రియా కపూర్, డిజైనర్-నటి పెర్నియా ఖురేషీ తదితరులు హాజరయ్యారు. డిన్నర్ పూర్తయ్యాక హోటల్ నుంచి బయటకు వస్తూ యువీ, హాజల్ లు మీడియా కంట పడ్డారు. ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని వస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.