: నక్సల్స్ ప్రతీకారం... కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ మేనల్లుడిని కాల్చి చంపిన బీజాపూర్ మావోలు
ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ తో తమకు జరిగిన నష్టానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న మావోయిస్టులు, శుక్రవారం నాడు కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ మేనల్లుడు రాహుల్ రాయుడు ని కాల్చి చంపారు. ఈయన పోలీస్ జవాన్ గా పనిచేస్తున్నాడు. తెల్లవారుజామున బీజాపూర్ జిల్లాలో రాహుల్ ని అటకాయించిన మావోలు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో బీజాపూర్ ప్రాంతంలో పోలీసు బలగాలను భారీగా పెంచారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో విస్తృతంగా కూంబింగ్ ప్రారంభించారు. ఈ కాల్పుల ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.