: తిరుమలలో శ్రీవారి భక్తులకు చిల్లర కష్టాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో తిరుమల తిరుపతిలో శ్రీవారి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న జనాలు బ్యాంకుల్లో పాత నోట్లు మార్చుకొని కొత్త 2000 రూపాయల నోట్లు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తిరుమలలో భక్తులు చిల్లర దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో ఇప్పటి వరకు ఏటీఎం కేంద్రాలు ఓపెన్ కాలేదు. అక్కడి ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్ బ్యాంకుల్లోని ఏటీఎంలలో తప్ప వేరే బ్యాంకుల ఏటీఎంలలో డబ్బు అందుబాటులో లేనట్లు సమాచారం. పలువురు భక్తులు బ్యాంకుల వద్దకు వెళ్లి బ్యాంకు ఉద్యోగులతో గొడవకు దిగుతున్నారు.