: కుదురుకున్న పుజారా, విజయ్... చెరో హాఫ్ సెంచరీతో పరిగెడుతున్న ఇండియా
రాజ్ కోట్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ దారి పట్టినా, మురళీ విజయ్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారాలు నిలదొక్కుకుని ఆడుతుండటంతో భారత స్కోరు పరుగు పెట్టడం ప్రారంభించింది. ఈ క్రమంలో పుజారా, విజయ్ లు చెరో హాఫ్ సెంచరీ సాధించారు. పుజారా 50, విజయ్ 55 పరుగులతో క్రీజులో కుదురుగా ఆడుతున్నారు. ప్రస్తుతం భారత స్కోరు 47 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 156 పరుగులు. ఫాలో ఆన్ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే భారత్ ఇంకా 181 పరుగులు చేయాల్సి ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 537 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కాగా, నేటి లంచ్ విరామం తరువాతి సెషన్ భారత్ కు అత్యంత కీలకమని పరిశీలకులు వ్యాఖ్యానించారు.