: నోట్ల రద్దును గురువు మెచ్చుకున్నా, శిష్యుడు మెచ్చుకోలేదు!


ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని ప్రముఖ సామాజిక వేత్త, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అన్నా హజారే మెచ్చుకున్నారు. అవినీతిని, నల్లధనాన్ని అరికట్టే క్రమంలో ఇదొక విప్లవాత్మకమైన చర్య అని కితాబిచ్చారు. ఎన్నికలు, రాజకీయాల్లో కూడా నల్లధనాన్ని పూర్తిగా అరికట్టాలని... ఇది కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలే అని అన్నారు. పెద్ద ఎత్తున ఎన్నికల సంస్కరణలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ భారీ మొత్తంలో విరాళాలను స్వీకరిస్తున్నాయని... కానీ ఐటీ అధికారుల దాడుల నుంచి తప్పించుకోవడానికి దాతల పేర్ల మీద రసీదులు ఇస్తుంటారని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన నోట్లు నల్లకుబేరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అన్నా హజారే శిష్యుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తప్పుబట్టారు. నోట్లను రద్దు చేసినంత మాత్రాన నల్లధనం సమస్య తీరిపోదని ఆయన అన్నారు. బీజేపీ, దాని మిత్రపక్ష నేతలకు నోట్ల రద్దు విషయం వారం రోజుల ముందే తెలిసిందని... దాంతో వారంతా జగ్రత్తపడ్డారని... ఆ తర్వాతే నోట్లను ప్రధాని రద్దు చేశారని విమర్శించారు.

  • Loading...

More Telugu News