: ఒక్క గ్రామాన్ని కాదు, మొత్తం అనంతపురాన్నే దత్తత తీసుకుంటా: పవన్ కల్యాణ్
అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వహిస్తోన్న విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానం చెబుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను ఓ విద్యార్థి ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటారా? అని అడిగారు. దానికి సమాధానంగా పవన్ కల్యాణ్.. ‘ఒక్క గ్రామాన్ని కాదు, మొత్తం అనంతపురాన్నే దత్తత తీసుకుంటానని అన్నారు. అంతటితో ఆగకుండా మొత్తం రాయలసీమను దత్తత తీసుకుంటానని చెప్పారు. ‘అమరావతి అభివృద్ధికి ఎంతో డబ్బు ఖర్చుపెడుతున్నారు. అనంతపురాన్ని పట్టించుకోకపోతే నేను ఊరుకోను. అమరావతి అద్భుతంగా అభివృద్ధి జరిగి, అనంతపురం ప్రజలు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోనని అన్నారు. తాను ఏది మాట్లాడినా ఆలోచించే మాట్లాడతానని పవన్ కల్యాణ్ అన్నారు. తాను దేశానికి, రాష్ట్రానికి ఏం చేయగలననే విషయాన్నే ఆలోచిస్తానని చెప్పారు.