: పెద్ద నోట్ల ర‌ద్దు మంచిదే!: ప‌వ‌న్ క‌ల్యాణ్


ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీసుకున్న‌ పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం మంచిదేన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వహిస్తోన్న విద్యార్థుల‌తో ఇష్టాగోష్ఠిలో ఆయన ఓ విద్యార్థి పెద్దనోట్ల రద్దు అంశంపై అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతూ... దేశంలో కూరుకుపోయిన అవినీతి, న‌ల్ల‌ధ‌నం, న‌కిలీ నోట్ల నిరోధానికి ఇటువంటి నిర్ణ‌యాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. క‌ట్టిన ప‌న్నులతో ప్ర‌భుత్వ ఆదాయం పెరిగి మ‌ళ్లీ అది జ‌నాల‌కే అందితే ఎంతో సంతోష‌మ‌ని చెప్పారు. బ్లాక్ మ‌నీ ప్ర‌క్షాళ‌న రాజ‌కీయ నాయ‌కుల నుంచే జ‌రిగితే బాగుంటుంద‌ని అన్నారు. మ‌నిషి ఆదాయానికి మించిన ఖర్చు కూడా చేయకూడదని సూచించారు.

  • Loading...

More Telugu News