: మెక్సికో అధ్యక్షుడి ఆశలను ట్రంప్ నెరవేరుస్తారా?


అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో తమలో కొత్త ఆశ చిగురించిందని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో తెలిపారు. అమెరికాతో కలిసి పని చేసేందుకు కొత్త అజెండా రూపొందించుకుంటామని చెప్పారు. తనకు చాలా నమ్మకం ఉందని... ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అజెండాను రూపొందించుకుంటామని ఆశిస్తున్నట్టు తెలిపారు. మెక్సికన్ల రక్షణే తనకు ప్రధానమని... వారిని రక్షించుకోవడంపైనే తన ప్రధాన దృష్టి ఉంటుందని చెప్పారు. అమెరికాతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, పరస్పర గౌరవంతో ముందుకెళతామని ఆయన తెలిపారు. అయితే, ఎన్నికల ప్రచార సమయంలో మెక్సికన్లను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ... దొంగలు, దోపిడీదారులు అంటూ దూషించారు. ఈ నేపథ్యంలో, మెక్సికోతో ట్రంప్ ఎలాంటి సంబంధాలను కొనసాగిస్తారో అనే సందిగ్ధత నెలకొంది.

  • Loading...

More Telugu News