: సూర్యాపేటలో రోడ్డుపై రూ. 500 నోట్ల కట్టల బస్తా!
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై, సూర్యాపేట పట్టణం వద్ద రోడ్డపై నోట్ల కట్టల బస్తా కనిపించడం కలకలం రేపింది. ఇక్కడి ఆర్ కేఎల్ కే కాలేజీ సమీపంలో మొత్తం 500 రూపాయల నోట్లున్న ఓ బస్తాను గుర్తించినట్టు పలువురు స్థానికులు తెలిపారు. ఈ నోట్లను ముట్టుకునేందుకు ప్రజలు భయపడ్డారని తెలిపారు. విషయం గురించి తెలుసుకున్న పోలీసులు వచ్చేసరికి ఈ నోట్ల బస్తా మాయమైంది. చెత్తను తీసుకువెళ్లే మునిసిపల్ సిబ్బంది దీన్ని తీసుకువెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. నోట్ల బస్తాపై విచారిస్తామని పోలీసులు తెలిపారు.