: గాంధీయిజం నాకు ఇష్టమే.. కానీ, అన్ని సమస్యలకు అది పరిష్కారం కాదు: పవన్ కల్యాణ్
గాంధీయిజం అంటే తనకు ఇష్టమేనని, కానీ అన్ని సమస్యలకు అది పరిష్కారం కాదని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వహిస్తోన్న విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో ఆయన విద్యార్థులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ నిరాహార దీక్షలతో అన్ని సమస్యలు పరిష్కారం కావని అన్నారు. అలాగని ఆవేశ పడడం కూడా సమస్యలకు పరిష్కారాలు చూపవని చెప్పారు. ఓ ప్రణాళికతో సమగ్రంగా ఆలోచించి ముందుకు వెళ్లాలని సూచించారు. తాను ఇచ్చిన మాటపై ఎక్కడా తగ్గబోనని, ప్రజల సమస్యలపై మాట్లాడతానని అన్నారు.