: ప‌వ‌న్ కల్యాణ్ ఇష్టాగోష్ఠి ప్రారంభం.. ప్ర‌శ్న‌లు అడ‌గాల‌ని ఆస‌క్తిక‌రంగా కోరిన జ‌న‌సేనాని


అనంపురం జిల్లా గుత్తిలో పవన్ కల్యాణ్ నిర్వహించతలపెట్టిన ఇష్టాగోష్ఠి ప్రారంభమైంది. విద్యార్థులను ప్ర‌శ్న‌లు అడ‌గాల‌ని జ‌న‌సేనాని పవన్ ఆసక్తికరంగా కోరారు. మనం ఏ స్థితిలో ఉన్నా చుట్టు ప‌క్క‌ల వారికి ఎలా ఉప‌యోగ‌ప‌డాలో విద్యాల‌యాల్లోనే నేర్చుకోవాలని అన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడాలో తనకు తెలియ‌డం లేదని, విద్యార్థులు అడిగితే తాను ఏదైనా మాట్లాడ‌తాననని అన్నారు. విద్యాలయంలో నేర్చుకున్న సాయం చేసే గుణమే అందరినీ ఉన్నత స్థానానికి తీసుకొస్తుందని చెప్పారు. సాయం చేయాల‌నే గుణాన్ని విద్యాల‌యాల నుంచే నేర్చుకున్నానని అన్నారు. ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతానని, అందరూ అడగాలని కోరారు.

  • Loading...

More Telugu News