: మళ్లీ నిరాశ పరిచిన గౌతమ్ గంభీర్
రాజ్ కోట్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో చాలా రోజుల తరువాత జట్టులో తిరిగి స్థానం సంపాదించుకున్న ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి నిరాశపరిచాడు. మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే బ్రాడ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు. 72 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో గంభీర్ 29 పరుగులు చేశాడు. దీంతో గంభీర్ నుంచి పెద్ద స్కోరును కోరుకుంటున్న ఆయన అభిమానులకు నిరాశే ఎదురైనట్లయింది. మరో ఎండ్ లోని మురళీ విజయ్ 73 బంతుల్లో 25 పరుగులతో ఆడుతుండగా, ప్రస్తుతం అతనికి పుజారా వచ్చి కలిశాడు. ప్రస్తుతం భారత స్కోరు 25 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుతో పోలిస్తే, భారత్ 464 పరుగులు వెనుకబడివుంది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 264 పరుగులు చేయాల్సి వుంది.