: హైదరాబాద్ ను కమ్మేసిన శీతల పవనం... చలిపులికి వణుకుతున్న ప్రజలు
హైదరాబాద్ నగరంపై చలి పులి పంజా విసిరింది. ఈ సీజన్ లో ఎన్నడూ లేనివిధంగా రాత్రిపూట ఉష్ణోగ్రత 13.5 డిగ్రీలకు పడిపోయింది. నగరాన్ని శీతల పవనాలు కమ్మేయడమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో నవంబర్ రెండో వారంలో 19 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయని, కానీ పరిస్థితులు మారిన కారణంగా సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత పడిపోయిందిని తెలిపారు. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సైతం శీతల గాలులు వీచవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ప్రాంతంలో చలి మరింతగా పెరగవచ్చని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.