: టీడీపీ నేత గొర్లె హరిబాబునాయుడు కన్నుమూత
మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ నేత గొర్లె హరిబాబునాయుడు గత రాత్రి శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం పాకర్లపల్లిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే చికిత్సను పొందుతున్నారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు నమ్మకమైన అనుచరుడిగా పేరున్న హరిబాబు, 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాకుళంలో ప్రజాగర్జన జరిగిన వేళ, చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. హరిబాబునాయుడు మృతిపట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.