: ట్రంప్ గెలిస్తే వీరంతా ఎక్కడెక్కడకు వెళతామన్నారో గుర్తుందా?


అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే తాము అమెరికా విడిచి వెళతామని హాలీవుడ్ ప్రముఖులు చాలా మంది వ్యాఖ్యానించారు. ట్రంప్ గెలుపు ఇప్పుడు వీరికి మింగుడుపడటం లేదు. వారందరినీ ట్రంప్ మద్దతుదారులు ఇప్పడు గేలి చేస్తున్నారు. అసలు ఎవరెవరు ఏమేం అన్నారో ఓ సారి గుర్తు చేసుకుందాం. మిలీ సైరస్: దేశం విడిచి వెళ్తానని చెప్పింది. అయితే ఎక్కడకో కచ్చితంగా చెప్పలేదు. లెనా డన్హమ్: కెనడాలోని వాంకోవర్ కు వెళ్లిపోతానని చెప్పింది. శామ్యూల్ ఎల్ జాక్సన్: దక్షిణాఫ్రికాకు పోతానని ప్రకటించాడు. జురాసిక్ పార్క్, స్టార్ వార్స్ లాంటి చిత్రాల్లో ఈయన నటించాడు. నటాషా ల్యోన్: ట్రంప్ గెలిస్తే ఏకంగా మెంటల్ హాస్పిటల్ కు వెళ్లి అడ్మిట్ అవుతానని చెప్పింది. జార్జ్ లోపెజ్: లాటిన్ అమెరికా దేశాలకు వెళ్లిపోతానని ప్రకటించాడు. కమెడియన్ గా జార్జ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. చెర్: ఈవిడను 'గార్డెన్ ఆఫ్ పాప్' అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈవిడైతే ఏకంగా గురు గ్రహానికి వెళతానని చెప్పింది. మరోసారి మాట్లాడుతూ, కెనడాకు వెళ్లడానికి అప్పుడే టికెట్ కూడా కొనుక్కున్నానని చెప్పింది. చెల్సియా హ్యండ్లర్: స్పెయిన్ కు వెళతానని చెప్పింది. బ్రయాన్ క్రాన్ స్టన్: కెనడాకు గాని, ఆస్ట్రేలియాకు గాని వెళ్లిపోతానని చెప్పాడు. మరో విషయం ఏమిటంటే... ఇలాంటి ఛాలెంజ్ లే మన దేశంలో కూడా కొంత మంది ప్రముఖులు చేశారు. నరేంద్ర మోదీ ప్రధాని అయితే, దేశం విడిచి వెళ్తానని ఙ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత అనంతమూర్తి అన్నారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్ అయితే మరో అడుగు ముందుకేసి, తన పేరే మార్చుకుంటానని చెప్పారు. మరి, వీరందరికీ వారు చేసిన సవాళ్లు గుర్తున్నాయో? లేదో? దేవుడికే తెలియాలి.

  • Loading...

More Telugu News