: నేడు ఇంజినీరింగ్ విద్యార్థులతో పవన్ కల్యాణ్ ఇష్టాగోష్ఠి
అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలో ఉన్న గేట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ నేడు ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా, విద్యార్థుల ఆలోచనలను పవన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నిన్న సాయంత్రం అనంతపురంలో పవన్ కల్యాణ్ భారీ బహిరంగసభ నిర్వహించిన సంగతి తెలిసిందే. జనసేన తొలి కార్యాలయాన్ని అనంతపురంలోనే ఏర్పాటు చేస్తామని, 2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.