: మందుబాబులకు పండగ... ఇకపై ఏపీలో అడుగడుగునా ఓ బార్!
ఏపీలోని మందుబాబులకు ఇకపై పండగే పండగ. బీచ్ లలోను, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనూ వీలైనంత ఎక్కువగా బార్లను తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం జీవో 470ని జారీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో గల ఫుడ్ పార్లర్స్ లోను, బీచ్ ప్రాంతాల్లోనూ మద్యం విక్రయాలను చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూల్స్ ప్రకారం బార్ తెరవడానికి 200 చదరపు మీటర్ల స్థలం ఉండాలి. కానీ, ఇప్పుడు కనీసం 100 చదరపు మీటర్ల స్థలం ఉంటే సరిపోతుంది.