: ఇండియా బౌలర్లకు చురకలు, ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కు హెచ్చరికలు చేసిన హర్భజన్


టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భజ్జీ మాట్లాడుతూ, కఠినమైన పిచ్‌ లపై బౌలింగ్‌ చేసినప్పుడే బౌలర్‌ కు మజా వస్తుందని అన్నాడు. లైన్‌ విషయంలో బౌలర్ నిలకడ ప్రదర్శించాలని సూచించాడు. వికెట్లు పడనప్పుడు బంతితో విభిన్న రకాలుగా ప్రయత్నించాలని సూచించాడు. అలాంటప్పుడే ఒక బౌలర్‌ సామర్థ్యం తెలుస్తుందని భజ్జీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జో రూట్‌, బెన్ స్టోక్స్‌, మొయిన్‌ బాగా బ్యాటింగ్‌ చేశారని కితాబిచ్చాడు. ఐతే భారత్‌ బౌలర్లను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించాడు. ఇప్పటికే వారేమిటో నిరూపించుకున్న తరువాత జట్టులో స్థానం సంపాదించారన్న సంగతి గుర్తుంచుకోవాలని భజ్జీ విమర్శకులకు సమాధానం ఇచ్చాడు.

  • Loading...

More Telugu News