: రేపు గుత్తిలో ఇంజనీరింగ్ విద్యార్థులతో పవన్ ఇష్టాగోష్ఠి
జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇంజనీరింగ్ విద్యార్థులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడనున్నారు. అనంతపురం జిల్లా గుత్తిలోని స్టానిక గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా, అనంతపురంలో సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో పవన్ ఈరోజు పాల్గొన్న విషయం తెలిసిందే.